Header Banner

తిరుపతి- షిర్డీ భక్తులకు గుడ్ న్యూస్! దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం!

  Sat Apr 12, 2025 16:54        Others

వేసవి కాలంలో ప్రయాణికుల తాకిడి అధికంగా ఉండటాన్ని దృష్టిలో పెట్టుకొని, దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు సందర్శించేందుకు లేదా దూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రజలు ఎక్కువగా రైళ్లపై ఆధారపడటం వల్ల, ఈ సమయంలో రద్దీ అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో, సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న రైల్వే జోన్ నుంచి పలు స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టడం జరుగుతోంది. ఇందులో భాగంగా, చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్‌కు కొత్త స్పెషల్ ఎక్స్‌ప్రెస్ నడపనున్నారు. ఈ రైలు నంబర్ 07025 ప్రతి శనివారం రాత్రి 9:15కి చర్లపల్లి నుంచి బయలుదేరి, రెండవ రోజు అర్ధరాత్రి 12:15కి శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. నల్గొండ, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, సమర్లకోట, విజయనగరం వంటి ముఖ్యమైన స్టేషన్ల మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.

 

అలాగే, ఇప్పటికే నడుస్తున్న కొన్ని వేసవి ప్రత్యేక రైళ్లను కూడా రైల్వే అధికారులు పొడిగించారు. తిరుపతి-షిర్డీ మధ్య నడిచే 07637, 07638 రైళ్లను వరుసగా జూన్ 29, 30 తేదీల వరకు పొడిగించారు. ఖాజీపేట్-దాదర్ మధ్య నడిచే 07197/07198 రైళ్లు కూడా జూన్ 28, 29 వరకు కొనసాగనున్నాయి. అలాగే మచిలీపట్నం-తిరుపతి మధ్య మరో స్పెషల్ రైలును నడపనున్నారు. మే 13 నుంచి మే 25 వరకు ప్రతి ఆదివారం తిరుపతి నుంచి రాత్రి 10:20కి బయలుదేరే 07121 రైలు, మరుసటి రోజు ఉదయం 7:30కి మచిలీపట్నానికి చేరుతుంది. మే 14 నుంచి మే 26 వరకు ప్రతి సోమవారం సాయంత్రం 5:40కి మచిలీపట్నం నుంచి బయలుదేరే 07122 రైలు, మరుసటి రోజు తెల్లవారుజామున 3:20కి తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైళ్లు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, విజయవాడ వంటి ప్రధాన స్టేషన్ల మీదుగా వెళ్తాయి.

 

ఇది కూడా చదవండి: ఏపీ మంత్రులకు చంద్రబాబు మార్క్ షాక్! తొలిగింపు లిస్టులో నెక్స్ట్ వారే.!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సచివాలయ ఉద్యోగులపై తాజా నిర్ణయం.. నియామక బాధ్యతలు వారీకే! ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ!


రేషన్ కార్డు EKYC పూర్తి చేసుకున్నారా! లేకపోతే అవి రావు! త్వరగా ఇలా చెక్ చేసుకోండి!


పేదల కలలు నెరవేర్చిన లోకేష్.. 1,030 మందికి శాశ్వత ఇంటిపట్టాలు! 5వ రోజు "మన ఇల్లు" కార్యక్రమం!


పోలీసులపై జగన్ వ్యాఖ్యలు హేయం.. క్షమాపణ చెప్పాలి! బీజేపీ అధ్యక్షురాలు ఆగ్రహం!


వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #SpecialTrains #SummerSpecialTrains #IndianRailways #SouthCentralRailway #SCRUpdates #TrainTravel #SummerTravel #RailwayNews